Allu Arjun, Jr NTR: విదేశాల్లో విహరిస్తున్న అల్లు అర్జున్‌, తారక్ ఫ్యామిలీస్‌!

మన సీనియర్‌ స్టార్‌ హీరోలను కదిపితే ఆలస్యం… ‘హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో వరుస కుటుంబాన్ని చాలా మిస్‌ అయ్యాం’ అని చెబుతుంటారు. దాని వల్ల కొన్ని అందమైన అనుభూతులు మిస్‌ అయ్యాం అని చెబుతుంటారు. అయితే ఈ తరం స్టార్‌ హీరోలు ఆ పని చేయడం లేదు. పనిని – కుటుంబాన్ని చక్కగా మేనేజ్‌ చేసుకుంటున్నారు. కుటుంబంలో ముఖ్యమైన రోజుల్ని ఏ మాత్రం మిస్‌ అవ్వకుండా… ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్‌, తారక్‌ కూడా ఇదే చేశారు.

అల్లు అర్జున్ – స్నేహల గారాలపట్టి అల్లు అర్హ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబమంతా దుబాయి చెక్కేసింది. అక్కడ బుర్జ్‌ ఖలీఫా మీద బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోలను బన్నీ దంపతులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఎన్టీఆర్‌ తన కుటుంబంతో పారిస్‌ వెళ్లాడు. తనయుడు అభయ్‌రామ్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ కూడా చేశాడు. ఐఫిల్‌ టవర్‌ బ్యాగ్రౌండ్‌లో ఆ పిక్‌ అదిరిపోయింది. ముందుగా చెప్పుకున్నట్లు ఓవైపు సినిమా పనులతో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి టైమ్‌ కేటాయించారు ఈ హీరోలు.

‘పుష్ప’ సినిమా డబ్బింగ్‌ పనులు ఇటీవల మొదలయ్యయి. వాటికి బ్రేక్‌ ఇచ్చి దుబాయి వెళ్లాడు బన్నీ. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అయినా తారక్‌ తన ఫ్యామిలీకి టైమ్‌ కేటాయించాడు. టూర్‌ ముగించుకొని తిరిగి ఇక్కడికి రాగానే సినిమా పనుల్లో బిజీ అయిపోతారు.

1

2

3

4

5

6

7

8

9

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus