ఆ విషయంలో బన్నీ మహేష్, ఎన్టీఆర్ లను అధిగమించాడు

ఫస్ట్ లుక్ తోనే రికార్డుల మోత మొదలెట్టాడు బన్నీ. ఆయన లేటెస్ట్ మూవీ పుష్ప ఫస్ట్ లుక్ బన్నీ పుట్టిన రోజు కానుకగా ఏప్రిల్ 8న విడుదల కాగా, విశేష స్పందన అందుకుంది. రాయలసీమ మొరటు కుర్రాడిగా బన్నీ డీగ్లామర్ లుక్ లో చక్కగా కుదిరాడు. ఎటువంటి పాత్రలోనైనా తాను ఇట్టే లీనం కాగలనని నిరూపించాడు. సుకుమార్ పుష్ప చిత్రాన్ని శేషాచలం అడవులలో సాగే అక్రమ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా ఆ పాత్ర కోసం బన్నీ ఇలా అవతారం ఎత్తాడు.

ఇక బన్నీ హెయిర్ స్టైల్ మరియు డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే ఈ మూవీ కూడా సుకుమార్ గత చిత్రం మాదిరి పీరియాడిక్ డ్రామానా అనే సందేహం కలుగుతుంది. ఇక బన్నీ పుష్ప ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్, మహేష్ లను దాటివేశాడు. బన్నీ లుక్ ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ సాధించినదిగా రికార్డులకు ఎక్కింది. 84.1 వేల లైక్స్ తో ఈ చిత్రం ఫస్ట్ లుక్ తెలుగు నుండి మొదటిస్థానంలో నిలిచింది.

Allu Arjun breaks NTR & Mahesh Babu's records1

గతంలో 70.2 వేల లైక్స్ తో ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ లుక్ మొదటి స్థానంలో ఉండగా, బన్నీ దానిని అధిగమించాడు. దీనితో 67.2 వేల లైక్స్ తో మహేష్ మహర్షి లుక్ సెకండ్ స్థానం నుండి మూడో స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురంలో మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న బన్నీ ఫస్ట్ లుక్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టాడు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus