షారుఖ్‌ సినిమాలో అల్లు అర్జున్‌… ఇవిగో పూర్తి వివరాలు!

షారుఖ్‌ ఖాన్‌ సినిమాలో అల్లు అర్జున్‌ నటిస్తున్నాడు? కాదు, కాదు అలాంటి ఆలోచనేం లేదు! గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో దీని గురించే చర్చ నడుస్తోంది. షారుఖ్‌ ప్రధాన పాత్రలో ప్రస్తుతం రూపొందుతున్న ‘జవాన్‌’ అనే సినిమా గురించే ఇదంతా. ఆ సినిమాలో ఓ కీలక పాత్రలో బన్నీ నటిస్తున్నాడు అనేది ఆ పుకార్ల సారాంశం. అయితే ఇన్నాళ్లూ ఈ విషయంలో లేదు లేదంటూ వచ్చిన బన్నీ సన్నిహిత వర్గాలు ఇప్పుడు అవును అంటున్నాయి అట. అంతే కాదు ఇప్పటికే షూటింగ్‌ కూడా అయిపోయింది అని సమాచారం.

షారుఖ్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంల ‘జవాన్‌’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఇందులో బన్నీ ఉన్నాడు అనే వార్త వచ్చింది. అయితే అప్పుడు లేదు అన్నారు కూడా. అయితే ఇన్నాళ్లూ లేడు అని చెప్పిన ఆ కొందరే.. అల్లు అర్జున్ నెల రోజుల కిందట ముంబయిలో ‘జవాన్’ సినిమా సెట్‌లో ఉన్నాడని అంటున్నారు. తన రోల్‌కు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడని కూడా చెబుతున్నారు.

‘జవాన్‌’లో చిన్న కేమియో గురించి బన్నీని అడగ్గా.. ఒప్పేసుకున్నాడు అని అంటున్నారు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని త్వరలో ప్రకటిస్తారని సమాచారం. భారీ స్థాయిలో ప్రకటించడం కోసమే ఇప్పుడు చెప్పడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే బన్నీకి ఈ సినిమా ఒక విధంగా బాలీవుడ్‌ ఎంట్రీ. అందుకే భారీ స్థాయిలో ఈ విషయాన్ని చెబుదాం అని అనుకుంటున్నారట. మరోవైపు ఇలాంటి విషయాల్లో బన్నీ చాలా పర్టిక్యులర్‌గా ఉంటాడు.

‘తుఫాన్‌’ సినిమాతో రామ్‌చరణ్‌ ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేశాడు. ఇటీవల ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్’తో గెస్ట్‌ రోల్‌ కూడా చేసేశాడు. తారక్‌ కూడా ‘వార్‌ 2’ ఓకే చేసేశాడు. కాబట్టి బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీ బాకీ ఉంది. ఇప్పుడు షారుఖ్‌ ‘జవాన్‌’తో అది తీరిపోతుంది. ఆ తర్వాత షాహిద్‌ కపూర్‌తో బన్నీ మల్టీస్టారర్‌ ఉంటుంది అని సమాచారం.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus