Allu Arjun: ఆ స్టార్ డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చేశారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ఆగష్టు చివరి వారం నాటికి పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత బన్నీ ఐకాన్ మూవీలో నటిస్తారని వార్తలు వచ్చినా బన్నీ తరువాత సినిమా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్న బోయపాటి శ్రీను తరువాత సినిమా గురించి అధికారిక ప్రకటన రాలేదనే సంగతి తెలిసిందే.

బన్నీ తర్వాత సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే తెరకెక్కనుందని గీతా ఆర్ట్స్ బన్నీ తరువాత సినిమాకు దర్శకత్వం వహించేందుకు బోయపాటి శ్రీనుకు అడ్వాన్స్ ఇచ్చిందని ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా అల్లు అర్జున్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేయడంతో పాటు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే బన్నీ బోయపాటి శ్రీను కాంబో మూవీ గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాల్సి ఉంది.

అల్లు అర్జున్ తరువాత సినిమాల డైరెక్టర్ల జాబితాలో మురుగదాస్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ కూడా ఉన్నారు. బన్నీ తరువాత సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలలో మాత్రమే నటించాలని భావిస్తున్న అల్లు అర్జున్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్ప 1 రిజల్ట్ ను బట్టి పుష్ప 2 ప్రాజెక్ట్ విషయంలో బన్నీ ముందుకెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus