‘పుష్ప 2’తో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొట్టిన తర్వాత, దేశంలోని బడా డైరెక్టర్లంతా బన్నీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే చేతిలో భారీ ప్రాజెక్టులు ఉండగా, ఇప్పుడు మరో కోలీవుడ్ సెన్సేషన్ కూడా ఈ రేసులో చేరడంతో బన్నీ లైనప్ ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌గా మారిపోయింది.
ALLU ARJUN
ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా అట్లీ సినిమా మీదే ఉంది. 700 కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి టేకింగ్ అంటే ఇది మామూలు సినిమా కాదు. షారుఖ్‌ను ‘జవాన్’గా చూపించిన అట్లీ, ఇప్పుడు బన్నీని గ్లోబల్ ఆడియన్స్ ముందు నిలబెట్టడానికి ఒక విజువల్ వండర్‌ను చెక్కుతున్నాడు. ఈ ఒక్క ప్రాజెక్టే బన్నీ రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం.
అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బన్నీ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు మామూలు వాళ్లు కాదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే అడ్వాన్సులు పుచ్చుకుని కథలతో రెడీగా ఉన్నారు. అట్లీ సినిమా అవ్వగానే వీరిద్దరిలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనేది సస్పెన్స్. క్లాస్ కావాలంటే త్రివిక్రమ్, వైల్డ్ నెస్ కావాలంటే సందీప్.. బన్నీ చేతిలో రెండు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి.
తాజాగా ఈ లిస్ట్‌లోకి విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ పేరు వచ్చి చేరడం ఇప్పుడు హాట్ టాపిక్. లోకేష్ క్రియేట్ చేసే డార్క్ యూనివర్స్ (LCU)లో బన్నీ అడుగుపెడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ దాదాపు ఫైనల్ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే ఒక బిగ్ బాంబ్ పేలబోతోందని ఇండస్ట్రీ టాక్. వీరే కాకుండా ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ కూడా లైన్‌లో ఉన్నారట.
బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్. తొందరపడి సినిమాలు ఒప్పేసుకోకుండా, రాబోయే ఐదేళ్లకు సరిపడా పక్కా స్కెచ్ వేసుకున్నారు. కేవలం బాక్సాఫీస్ నంబర్స్ మాత్రమే కాదు, తన స్టార్‌డమ్‌ను పెంచే సత్తా ఉన్న డైరెక్టర్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో బన్నీ నుంచి వచ్చే ప్రతీ సినిమా ఒక ఈవెంట్‌లా ఉండబోతోందని అర్థమవుతోంది.