Pushpa 2: ‘కల్కి’ ‘దేవర’ స్టైల్లోనే ‘పుష్ప 2’.. ఆ సెంటిమెంట్ ప్రకారం బ్లాక్ బస్టరే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) హవానే నడుస్తోంది.’పుష్ప 2′ ట్రైలర్ గురించి, ‘పుష్ప 2’ రన్ టైం గురించి, ‘పుష్ప 2 ‘ ప్రీమియర్స్ గురించి, ‘పుష్ప 2’ టికెట్ టికెట్ రేట్ల గురించి, ‘పుష్ప 2’ ఓవర్సీస్ బుకింగ్స్ గురించి.. ఇలా సోషల్ మీడియాలో కూడా రకరకాల డిస్కషన్లు నడుస్తున్నాయి. సుకుమార్ (Sukumar) – అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ డోస్ పెంచారు.

Pushpa 2

ఇటీవల పాట్నాలో ఒక ఈవెంట్ జరిగింది. తర్వాత చెన్నైలో మరో ఈవెంట్. నిన్న కొచ్చిలో కూడా ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఈరోజు గోవాలో , రేపు ముంబైలో ‘పుష్ప 2’ ఈవెంట్లు జరగబోతున్నాయి. మరోపక్క ‘పుష్ప 2’ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. అలాగే అల్లు అరవింద్ వంటి టాలీవుడ్ పెద్దలకి అన్నపూర్ణలో షో వేశారు.

వాళ్ళు మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘పుష్ప 2’ లో హీరో ఎంట్రీ డిలే అవుతుందట. దాదాపు 20 నిమిషాల తర్వాతే అల్లు అర్జున్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఎంట్రీ కూడా ఫ్యాన్స్ కి మంచి హై ఇస్తుందని తెలుస్తుంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో.. హీరో ఎంట్రీ ఫాస్ట్ గా ఉంటుంది.

కానీ ఈ మధ్య చూసుకుంటే.. కథ డిమాండ్ చేయడం వల్ల కావచ్చు, హీరోల ఎంట్రీలు డిలే అవుతున్నాయి. ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) లో ప్రభాస్ (Prabhas)  ఎంట్రీ కూడా డిలే అయ్యింది. ఆ సినిమాలో 22 నిమిషాల వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదు.’దేవర’ (Devara) లో కూడా ఎన్టీఆర్ ఎంట్రీ 18 నిమిషాల వరకు ఉండదు. ఆ సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా అంతేనేమో..!

ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus