Allu Arjun: కొరటాల తప్పుకునేసరికి బన్నీ పరిస్థితి ఇదీ!

  • May 3, 2021 / 12:01 PM IST

ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఆగిపోవడం వల్ల చాలా సినిమాలు డిస్ట్రబ్‌ అయ్యాయని గతంలో ఓసారి చెప్పుకున్నాం. అలా డిస్ట్రబ్‌ అయిన సినిమాల్లో అల్లు అర్జున్‌ సినిమా కూడా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందని ప్రకటన కూడా జరిగిపోయింది. #AA21 అనే సిరీస్‌ కూడా ఇచ్చేశారు. అయితే ఆ సినిమా వదులుకొని కొరటాల ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లిపోయాడు. ఈ విషయం బన్నీతో చర్చల తర్వాతే అని కూడా అన్నారు.

అదంతా ఓకే కానీ ‘పుష్ప’ తర్వాత బన్నీ ఏం చేస్తాడు అనే డైలమా అయితే ఉండిపోయింది. ఆ డైలమాకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని AA టీమ్ ప్రయత్నిస్తోంది. అల్లు అర్జున్‌ – మురుగదాస్‌ కాంబోలో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఈలోగా ‘స్పైడర్‌’ డిజాస్టర్‌గా మారడంతో మురుగదాస్‌ – బన్నీ కాంబో పక్కకు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు కొరటాల సినిమా స్థానంలో మురుగదాస్‌ సినిమా రాబోతోందట. ఈ సినిమాకు సంబంధించిన వర్చువల్‌ చర్చలు జరుగుతున్నాయట.

కథ తదితర విషయాలు ఓకే అయిపోతే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించేయాలని ఐకాన్‌ స్టార్‌ చూస్తున్నాడట. నిజానికి అల్లు అర్జున్‌ తన 21వ సినిమా పాన్‌ ఇండియా రేంజిలో ఉండాలని అనుకున్నాడట. అందుకే కొరటాలతో పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌ కథ ఓకే చేసుకున్నాడు. అయితే అది ఆగిపోవడంతో మురుగదాస్‌ దర్శకత్వంలో అలాంటి కథే ట్రై చేస్తున్నాడట. ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌లో సినిమా గురించి కూడా ట్రై చేస్తున్నారట. ఒకవేళ మురుగదాస్‌ సినిమా ఓకే కాకపోతే, ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘ఐకాన్‌’కు నీళ్లొదిలేసినట్లే!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus