Allu Arjun, Rashmika: రష్మికను ట్రోల్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ ను సంపాదించుకోవడంతో రష్మికకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న టాలీవుడ్ హీరోలు రష్మిక తమ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తే తమకు కూడా సక్సెస్ దక్కుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక టాలీవుడ్ ప్రాజెక్ట్ లకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం బన్నీ అభిమానులు రష్మికను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. బన్నీ రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో పుష్ప ది రూల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తాజాగా రష్మిక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే తాజాగా బన్నీ ఒక యాడ్ కోసం నోట్లో సిగార్ తో కొత్త లుక్ లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ లుక్ కు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ గా ప్రశంసలు దక్కాయి. సోషల్ మీడియాలో ఈ లుక్ తెగ వైరల్ అయింది. అల్లు అర్జున్ ఫోటో గురించి రష్మిక స్పందిస్తూ ” సార్ మిమ్మల్ని ఒక్క క్షణం గుర్తు పట్టలేకపోయా” అని కామెంట్ చేశారు. రష్మిక కామెంట్ బన్నీ అభిమానులకు కోపం తెప్పించింది.

రష్మిక సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బన్నీని కూడా రష్మిక గుర్తు పట్టలేదా? అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు రష్మికకు ప్రస్తుతం హిందీ హీరోలు మాత్రమే గుర్తుంటారని తెలుగు హీరోలు గుర్తు ఉండరని కామెంట్లు చేస్తున్నారు. రష్మిక సరదాగా అలా కామెంట్ చేసి బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావడం గమనార్హం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus