కలిసి రాని విలన్ నే ‘పుష్ప’ సినిమాకి తీసుకున్నాడట..!

అల్లు అర్జున్‌ – సుకుమార్ ల హ్యాట్రిక్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘పుష్ప’. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 10 నుండీ తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల ప్రాంతంలో ప్రారంభమయ్యింది. నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగబోతుందని యూనిట్ సభ్యుల సమాచారం. ఈ చిత్రం షూటింగ్ స్పాట్ నుండీ బన్నీకి సంబంధించి రోజుకో ఫోటో బయటకి వస్తుంది. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అభిమానులు బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కోసం బన్నీ ఓ ప్లాప్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడట. వివరాల్లోకి వెళితే.. ‘పుష్ప’ చిత్రంలో విలన్ పాత్ర కోసం మొదటగా నిర్మాతలు విజయ్ సేతుపతిని సంప్రదించిన సంగతి తెలిసిందే.అయితే అప్పటికి విజయ్.. చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ‘పుష్ప’ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు. తరువాత నారా రోహిత్ ను కూడా సంప్రదించారు. కానీ అతను కూడా ఒప్పుకోలేదు. అయితే తాజాగా తమిళ హీరో ఆర్య ను సంప్రదించారని వినికిడి.అల్లు అర్జున్ సలహాతోనే ఆర్యను సంప్రదించారట. ఈ పాత్ర చెయ్యడానికి ఆర్య కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్.

దాంతో దాదాపు ఇతను ఫైనల్ అయినట్టే అని తెలుస్తుంది. అయితే గతంలో అల్లు అర్జున్.. ‘వరుడు’ సినిమాలో కూడా ఇతను విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అది ఫ్లాప్ అయ్యింది.పైగా ఆ చిత్రంలో అల్లు అర్జున్ ను ఆర్య డామినేట్ చేసాడనే కామెంట్స్ కూడా వినిపించాయి. అలాంటిది మళ్ళీ అతన్నే ‘పుష్ప’ సినిమా కోసం తీసుకోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus