వేణు శ్రీరామ్ తో బన్నీ మూవీ ఉన్నట్లా..? లేనట్లా..?

2021 సంవత్సరంలో దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కి విడుదలవుతున్న సినిమాల్లో తొలి సినిమా వకీల్ సాబ్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్ కావడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ కోసం బన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వేణు శ్రీరామ్ తొలి సినిమా ఓ మై ఫ్రెండ్ యావరేజ్ గా నిలవగా రెండో సినిమా ఎంసీఏ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టైంది. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అనే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐకాన్ ప్రాజెక్ట్ ఉన్నట్లా..? లేనట్లా..? అని ఫ్యాన్స్ లో సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ సినిమా ఉందని ప్రకటన చేశారు. అయితే బన్నీ మాత్రం వకీల్ సాబ్ రిజల్ట్ ను బట్టే ఐకాన్ విషయంలో ముందడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వకీల్ సాబ్ ఒకవేళ హిట్ కాకపోతే మాత్రం ఐకాన్ సినిమా ఆగిపోయినట్లేనని చెప్పవచ్చు. బన్నీ దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ రిజల్ట్ వేణు శ్రీరామ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లను కూడా డిసైడ్ చేస్తుందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే ఎక్కువగా నటిస్తున్న అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ తో చేస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus