టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ ‘పుష్ప’ సినిమాతో ఫ్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఉత్తరాదిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఎక్కడ చూసినా ‘పుష్ప’ మేనియానే. అంతబాగా సినిమాను ప్రమోట్ చేసుకున్నారు.
ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు మన ఐకాన్ స్టార్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇందులో అదనంగా ఒకట్రెండు పాత్రలు వచ్చి చేరతాయని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత బన్నీతో సినిమాలు చేయాలని కొరటాల, బోయపాటి లాంటి దర్శకులు భావిస్తున్నారు.
కానీ బన్నీ మాత్రం ఓ భారీ ప్రొడక్షన్ హౌస్ తో డీల్ పెట్టుకుంటున్నట్లు సమాచారం. గతంలో రజినీకాంత్ హీరోగా రోబో 2.ఓ సినిమాను రూపొందించిన లైకా ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలనుకుంటుంది. ఇప్పటికే బన్నీని సంపాదించినట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా కావడంతో బన్నీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇంకా డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక బన్నీ సినిమాను పట్టాలెక్కిస్తారేమో చూడాలి!