Allu Arjun: స్టార్ హీరో అల్లు అర్జున్ అక్కడ ఉండటానికి అసలు కారణమిదేనా?

  • July 10, 2023 / 05:01 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు కాగా ప్రస్తుతం పుష్ప2 సినిమాతో ఈ స్టార్ హీరో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. పుష్ప2 సినిమాలో కొత్త పాత్రలు సైతం కనిపించనున్నాయి. 1000 కోట్ల రూపాయల బిజినెస్ టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే టీడీపీ నేత ఫామ్ హౌస్ లో బన్నీ సందడి చేయడం గమనార్హం.

బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బన్నీతో త్రివిక్రమ్ మహాభారతం తీస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుల ఎంపికకు సంబంధించి బన్నీ ప్లానింగ్ అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తన ఫ్రెండ్స్ తో కలిసి బెంగళూరుకు వెళుతున్న బన్నీ కనుంపల్లి అనే గ్రామంలో ఆగి టీడీపీ నేత ముంటిమడుగు కేశవరెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కేశవరెడ్డి, ఆయన కొడుకు రాహుల్ రెడ్డి బన్నీకి అదిరిపోయే వంటకాలను వడ్డించారని సమాచారం. రాయలసీమ వంటకాలను రుచి చూసిన బన్నీ చాలా సంతోషంగా ఫీలయ్యారని సమాచారం అందుతోంది. మరోవైపు పుష్ప2లో స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.

బన్నీ (Allu Arjun) తన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. బన్నీని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. బన్నీకి రాబోయే రోజుల్లో సైతం వరుస విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో బన్నీ బాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. బన్నీ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus