Allu Arjun: నార్త్ లో బన్నీ వెయ్యి కోట్ల క్లబ్.. బడా స్టార్ తరువాత మనోడే..!

ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ‘పుష్ప 2: ది రూల్’  (Pushpa 2: The Rule) సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలోనూ ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయల వసూళ్లతో ఈ చిత్రం బాహుబలి 2 (Baahubali 2), దంగల్‌ల తరువాత మూడవ అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించి హిందీ మార్కెట్‌లో సాధించిన సక్సెస్ మరింత ప్రాధాన్యత కలిగించింది. పుష్ప 2, హిందీ భాషలోనే రూ.1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న ఏకైక సౌత్ సినిమా కావడం విశేషం.

Allu Arjun

ఇంతకుముందు హిందీ భాషలో మాత్రమే ఈ రికార్డ్ ను అందుకున్న చిత్రాలు షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్,’ ‘జవాన్ (Jawan).’ ఇప్పుడు ఈ జాబితాలో బన్నీ కూడా చేరి, హిందీ ప్రేక్షకులను మెప్పించిన సౌత్ స్టార్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచారు. ‘పఠాన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1050 కోట్లు వసూలు చేయగా, ‘జవాన్’ రూ.1150 కోట్లతో మరింత దూసుకుపోయింది. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ గౌరవాన్ని పెంచగా, ‘పుష్ప 2’ సౌత్ సినిమా ప్రతిష్టను హిందీ బెల్ట్‌లో మరింత పెంచింది.

కేవలం హిందీ భాషలోనే 1000 కోట్లు అందుకోవడం, బన్నీకి పాన్-ఇండియా స్టార్ హోదాను మరింత బలపరిచింది. ‘పుష్ప 2’ విడుదలైనప్పటి నుంచి నార్త్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అనుకున్న దానికంటే ఎక్కువగా హిందీ మార్కెట్‌లో ఈ చిత్రం వసూళ్లు సాధించడం విశేషం. మొదటి పార్ట్ ‘పుష్ప: ది రైజ్’తో  (Pushpa)  ఆడియన్స్‌ను ఆకట్టుకున్న బన్నీ (Allu Arjun) , రెండవ భాగంతో తన స్థాయిని మరింత పెంచుకున్నారు.

ఈ సినిమా సక్సెస్‌తో నార్త్ ఇండియాలో బన్నీని సూపర్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేసింది. తాజాగా ఈ వసూళ్ల రికార్డు సాధించిన తర్వాత, బన్నీ పేరు హిందీ బెల్ట్‌లో ప్రఖ్యాతమైన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సరసన నిలిచింది. ‘బాహుబలి 2,’ ‘కేజీఎఫ్ 2’ (KGF 2) లాంటి చిత్రాలు పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ అయినప్పటికీ, హిందీ మార్కెట్‌లో వెయ్యి కోట్ల క్లబ్ చేరలేకపోయాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ సాధించిన విజయం మరింత స్పెషల్‌గా మారింది.

రాజమౌళి – మహేష్: బడ్జెట్ లో అండగా మరో బడా సంస్థ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus