టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడుగా కొనసాగిన పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి శత జయంతి వేడుకలను అల్లు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ శత జయంతి వేడుకలలో భాగంగా అల్లు కుటుంబ సభ్యులు అల్లు స్టూడియోస్ ప్రారంభించారు.ఇప్పటికే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ అలాగే ఆహా వంటి వాటిని నిర్మించారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సంపాదించినప్పటికీ తిరిగి అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని సినిమా షూటింగ్లకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ అల్లు స్టూడియోస్ నిర్మించిన విషయం తెలుస్తుంది.
ఈ క్రమంలోనే అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ అల్లు స్టూడియోస్ ను నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ అల్లు స్టూడియో గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ముందుగా అల్లు స్టూడియోస్ ప్రారంభానికి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవికి, తన ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ చాలామంది అనుకోవచ్చు అల్లు అరవింద్ కి గీత బ్యానర్ ఉంది, వారికి పెద్ద ల్యాండ్ కూడా ఉండి ఉంటుంది.
ఇలా అన్నీ ఉన్నవారికి స్టూడియో నిర్మించడం పెద్ద విషయం కాదని భావించి ఉంటారు. అయితే అందరూ అనుకున్న విధంగా ఈ స్టూడియోని నిర్మించినది లాభాల కోసం కాదు. మా తాతయ్య అల్లు రామలింగయ్య కోరిక మేరకు ఈ స్టూడియోని నిర్మించామని తెలిపారు. మామూలుగా తండ్రి చనిపోతే కొడుకులు కొన్ని సంవత్సరాలపాటు పూజలు చేస్తారు. అనంతరం పూజలు చేయడం మానేసి వారి జ్ఞాపకాలను గుర్తుగా పెట్టుకుంటారు
కానీ మా తండ్రి అల్లు అరవింద్ మాత్రం ప్రతి ఏడాది తన తండ్రి జయంతి వర్ధంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని,మా తాతయ్య పై మా తండ్రి చూపిస్తున్న ఈ అభిమానానికి అభినందనలు అంటూ అల్లు అర్జున్ వెల్లడించారు.ఇక అల్లు అనే పేరుతో ప్రారంభమైన ఈ స్టూడియోలో ఎన్నో మంచి సినిమాలు నిర్మాణం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!