కాచిగూడలో ‘పుష్ప’ సెకండ్ షెడ్యూల్!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ గత నెలలో సెట్స్ పైకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ మొదలుపెట్టారు. భారీ సెటప్ తో పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ మధ్యలో కరోనా కారణంగా షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి కలిగింది. సినిమా యూనిట్ లో చాలా మందికి కరోనా రావడంతో తిరిగి హైదరాబాద్ కి వచ్చేశారు. దీంతో షూటింగ్ కి గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు తిరిగి మారేడుమిల్లికి వెళ్లే పరిస్థితి లేక హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు.

తాజా సమాచారం ప్రకారం.. ‘పుష్ప’ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లోని కాచిగూడలో మొదలైంది. అక్కడ ఒక పాత కల్యాణమండపాన్ని అద్దెకి తీసుకొని షూటింగ్ చేస్తున్నారట. ఈ సినిమా పాతిక, ముప్పై ఏళ్ల ముందు నేపథ్యంలో సాగుతున్న చిత్రం కాబట్టి అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా సెటప్ చేసుకొని షూటింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులు పాటు ఇక్కడే షూటింగ్ జరిపి.. ఆ తరువాత హైదరాబాద్ శివార్లలో మరికొన్ని ఎపిసోడ్ లను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని మారేడుమిల్లికి వెళ్లాలని భావిస్తున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో అక్కడకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

గ్యాప్ లేకుండా షూటింగ్ జరిపితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయొచ్చని.. పక్కా ప్రణాళికతో ఉన్నారట సుకుమార్. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus