Allu Arjun: వైరల్ అవుతున్న బన్నీ పోస్ట్.. ఆ సినిమాలను ప్రస్తావిస్తూ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో సైతం సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న బన్నీ దేశముదురు, అల వైకుంఠపురములో సినిమాల గురించి ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు.

అల వైకుంఠపురములో సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలు అయిందని ఆ సినిమా షూటింగ్ మాధుర్యం ఇప్పటికీ నా హృదయంలో మిగిలిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి మరపురాని సినిమాను అందించినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని బన్నీ కామెంట్లు చేశారు. అదే సమయంలో బన్నీ దేశముదురు సినిమా గురించి సైతం ప్రస్తావించారు. ఈరోజుకు దేశముదురు 17 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు.

నా జీవితంలో ఇది అందమైన క్షణం అని ఇలాంటి సినిమాను అందించిన పూరీ జగన్నాథ్, దానయ్య, సినిమా బృందానికి కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. నా కెరీర్ లో మరపురాని విజయాలను అందించిన అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని ఆయన వెల్లడించారు. బన్నీ చేసిన ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనవరి 12 బన్నీకి లక్కీ డేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు జనవరి 12వ తేదీనే రిలీజ్ అయ్యాయని బన్నీ చెప్పకనే చెప్పేశారు. పుష్ప2 సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. పుష్ప2 సినిమా ఇతర భాషల్లో సైతం సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీని (Allu Arjun) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus