Allu Arjun: ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఏంటి?

  • November 29, 2021 / 11:22 AM IST

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌ సినిమాలేంటి? చాలా రోజులుగా అభిమానులకు ఈ ప్రశ్న వేధిస్తూనే ఉంది. కారణం బన్నీ ఇంతవరకూ స్పష్టత ఇవ్వకపోవడం. వరుస సినిమాలున్నాయి అని చెబుతున్నారు కానీ… ఏ సినిమా నెక్స్ట్‌ మొదలవుతుంది అనేది చెప్పడం లేదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే… బోయపాటి శ్రీను సినిమా మొదలవ్వాలి. అయితే సినిమాకు సంబంధించి కథ ఇంకా సెట్ అవ్వలేదనే టాక్‌ కూడా వినిపస్తుంది. అయితే ఇప్పుడు కొత్త పుకారు మొదలైంది.

బన్నీ మళ్లీ కొత్త కథలు వింటున్నాడని టాక్. టాలీవుడ్‌లో త్వరలో బంపర్ రిలీజ్‌లు ఉన్న ఇద్దరు దర్శకుల కథలను బన్నీ విన్నాడట. అందులో ఏ కథ నచ్చిందో తెలియదు కానీ… ఒకవేళ బోయపాటి సినిమా ఆలస్యమైతే… ఆ ఇద్దరిలో ఒకరి సినిమా ముందుకొచ్చేస్తుందని టాక్. అయితే ఇక్కడో డౌట్‌ వస్తుంది. అదే ‘ఐకాన్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ ఇప్పటికే మొదలవ్వాల్సింది. అయితే ఆ సినిమా విషయంలో ఒకడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తోంది.

దీంతో బన్నీ లైనప్ మీద క్లారిటీ రావడం లేదు. బన్నీ తాజా కథలు విన్న దర్శకులు అయితే ‘సర్కారు వారి పాట’ పరశురాం, ‘రాధేశ్యామ్‌’ రాధాకృష్ణ. వీరి కథను ముందుకు తీసుకెళ్తాడా? లేక ఇంక వేరెవరి కథలైనా విని ముందుకెళ్తాడా అనేది తెలియడం లేదు. ప్రశాంత్‌ నీల్‌ సినిమా కూడా ఒకటి ఉంది అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఎన్టీఆర్‌, చరణ్‌ సినిమాలయ్యాక ప్రశాంత్‌ – బన్నీ సినిమా ఉంటుందని టాక్‌. మొన్నీ మధ్య అల్లు అరవింద్‌ హింట్‌ ఇచ్చినట్లు… బన్నీ ‘పుష్ప’ టు బాలీవుడ్‌ అంటాడేమో చూడాలి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus