Alluarjun: మహేష్ తరువాత బన్నీనే..!

స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన స్టైలిష్ లుక్స్, కాస్ట్యూమ్స్, డాన్స్ లతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తను నటించే ప్రతీ సినిమాలో వేరియేషన్ ఉండేలా చూసుకుంటాడు. గతేడాది ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బన్నీ.. త్వరలోనే ‘పుష్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.

ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సాధించాడు. తాజాగా మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘దువ్వాడ జగన్నాథం’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డుని సాధించింది.

ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో కొన్ని వందల మిలియన్ వ్యూస్ ను అందుకుంది. తాజాగా తెలుగులో సింగిల్ ఛానెల్ లో 100 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అప్పట్లో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఈ రికార్డుని అందుకుంది. ఆ సినిమా తరువాత ‘డీజే’కి ఈ ఘనత దక్కింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus