Allu Arjun: ఆ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఒప్పుకుంటారాంటారా..!

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరోకు వెళ్లడం సాధారణమే. అయితే మొదటి నుంచి ఒక హీరోకు అనుకున్న కథ సడెన్ గా మరో హీరో చేస్తే మాత్రం హీరో ఒప్పుకున్నా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? అనేది ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ ఈ డైలమాలోనే ఉన్నారు. అసలు విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కాంబోలో ఐకాన్ సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే.

దువ్వాడ జగన్నాథం సమయంలో ఈ సినిమాను ప్రకటించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా గురించిన అప్డేట్ వచ్చింది లేదు. అసలు ఈ సినిమా ఉందా లేదా అన్న విషయం కూడా తెలియదు. ఇక ఈ సినిమా పేరునే బిరుదుగా మార్చుకొని ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఐకాన్ అనగానే బన్నీనే గుర్తొస్తాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఐకాన్ కథను వేణు శ్రీరామ్ మరో హీరోతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొన్నిరోజులుగా వేణు శ్రీరామ్, నితిన్ తో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐకాన్ కోసం అనుకున్న కథ నచ్చినా ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది కాబట్టి దాన్ని హోల్డ్ లో పెట్టారు. అల్లు అర్జున్ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన వేణు శ్రీరామ్ నితిన్ తో సినిమా ఫైనల్ చేసుకున్నాడు. నితిన్ తో వేణు శ్రీరామ్ వేరే కథ చెప్పి ఒప్పించాడా లేక ఐకాన్ కథతోనే వీరి కాంబో సినిమా వస్తుందా అన్నది మిస్టరీగా మారింది.

అయితే ఐకాన్ కథతో వీరి కాంబో వస్తే బన్నీ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? అన్నది ప్రస్తుతం ఉన్న ప్రశ్న. మరోవైపు దిల్ రాజు కూడా ఐకాన్ సినిమాను ఎప్పటికైనా అల్లు అర్జున్ తోనే చేయాలని ప్లానింగ్ తో ఉన్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతానికి సందీప్ వంగా సినిమానే ఓకే చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉందని తెలుస్తుంది.

పుష్ప ముందు వరకు ఐకాన్ ని కేవలం తెలుగు వరకే చేయాలని అనుకున్న దిల్ రాజు పుష్ప తో (Allu Arjun) బన్నీకి వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ చూసి ఐకాన్ తీస్తే నేషనల్ లెవెల్ లో అదరగొట్టేలా ప్లాన్ చేస్తున్నారట. సో ఎట్టిపరిస్థితుల్లో నితిన్ ఐకాన్ అయ్యే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. అల్లు అర్జున్ ఐకాన్ కనబడుట లేదు సినిమా కోసం అల్లు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus