ఆ గ్రామంలోనే “నా పేరు సూర్య‌” ఆడియో వేడుక.!

  • April 14, 2018 / 12:19 PM IST

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తీస్తున్న సినిమా “నా పేరు సూర్య“. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్, బన్నీ వాసులు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 4 న థియేటర్లోకి రానుంది. అందుకే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. సంగీత ద్వయం విశాల్-శేఖర్ లు స్వరపరిచిన పాటలు కొన్ని ముందుగానే రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పూర్తి పాటలను ఈనెల 22న రిలీజ్ చేయనున్నారు.

ఈ వేడుకను ముందుగా హైదరాబాద్ లోనే నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఇది సోల్జర్ గురించి తీస్తున్న సినిమా కావున ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని మిల‌ట‌రీ మాధ‌వ‌రం గ్రామంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఊళ్లో ఇంటికొక‌రు చొప్పున మిలిట‌రీలో ప‌నిచేస్తుంటారు. అందుకే ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని అక్క‌డ జ‌ర‌పాల‌ని అనుకుంటున్నారు. వేడుక సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయి. అన్ని ఖరారు కాగానే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం హైదరాబాద్‌లో ఈనెల 29 న నిర్వహించడం ఫిక్స్. ఇందులో ఎటువంటి మార్పు లేదని చిత్రబృందం స్పష్టం చేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus