Allu Arjun: బన్నీ జైలర్ డైరెక్టర్ కాంబో సినిమా అలా ఉండబోతుందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలకు ఏకంగా ఐదేళ్ల సమయం కేటాయించారు. ఇకపై వేగంగా సినిమాలలో నటించేలా అల్లు అర్జున్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బన్నీ తర్వాత సినిమాలు ఫిక్స్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు బన్నీ జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.

బన్నీ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా బన్నీ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బన్నీ నెల్సన్ కాంబో మూవీ 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించే నిర్మాతలకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జైలర్ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

నెల్సన్ తర్వాత సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బన్నీ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే బాలీవుడ్, మల్లూవుడ్ ఇండస్ట్రీలలో సక్సెస్ సాధించగా కన్నడలో కూడా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది. తమిళంలో మాత్రం బన్నీ మార్కెట్ మరింత పెరగాల్సి ఉంది.

సినిమా సినిమాకు తన రేంజ్ పెరిగేలా బన్నీ అడుగులు వేస్తుండగా రాబోయే రోజుల్లో బన్నీకి భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ (Allu Arjun)  కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus