Allu Arjun: పుష్ప సినిమాతో భారీగా పెరిగిన అల్లు అర్జున్ ఇమేజ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గంగోత్రి సినిమా ద్వారా తెలుగు తెలుగు హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఎంతో మంది అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. అయితే అల్లు అర్జున్ ప్రతి సినిమాకి తనలో ఎంతో కొత్తదనాన్ని చూపెడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ విధంగా అల్లు అర్జున్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈయనకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదట్లో నెగిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇలా పుష్ప సినిమాతో ఈయన కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా విపరీతమైన క్రేజ్ పొందారు.

ఇప్పటికి నార్త్ ప్రేక్షకులు పుష్ప సినిమా ఫీవర్ లోనే ఉన్నారని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలోని మ్యూజిక్ ఆల్బమ్ ఏకంగా ఫైవ్ బిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. ఈ సినిమాలో డైలాగులు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ విధంగా పుష్ప సినిమాతో ఎంతో మంచి హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఏకంగా ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజి పై ఫోటో రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా టుడే ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజీ పై అల్లు అర్జున్ ఫోటో రావడంతో ఈయనకి నార్త్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా జరగబోతున్న పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus