టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 (Pushpa2) సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తొందరగా పూర్తి చేసి ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి.
ఈ మూవీ కోసం అటు మూవీ మేకర్స్ తో పాటు అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న పుష్ప రాజ్ తాజాగా ఏపీలో ఎన్నికల సందర్భంగా తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు ఇటీవల నంద్యాలలో పర్యటించిన విషయం తెలిసిందే. బన్నీ ఇలా చేయడంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ, నెగటివ్ కామెంట్స్ చేసారు.
అయితే తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో, మీడియాతో మాట్లాడే ముందు నటుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన మిత్రుడు ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకునేందుకే తాను నంద్యాల పర్యటన చేశానని మరోసారి స్పష్టం చేశారు. క్రియాశీల రాజకీయాల్లోకి తన ఎంట్రీ గురించి ప్రశ్నించినప్పుడు, బన్నీ చిరునవ్వుతో ప్రతిస్పందించాడు.
రాజకీయాల్లోకి రావడం లేదు అని తెలిపారు బన్నీ. అలాగే తను ఎటువంటి ప్రచారాల్లో పాల్గొన్న పూర్తి మద్దతు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ కి అని తెలిపారు బన్నీ. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..