బన్నీవి వరుసగా పాన్ ఇండియాచిత్రాలేనట

అల వైకుంఠపురంలో మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన బన్నీ కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన వరుసగా స్టార్ డైరెక్టర్స్ తో మూవీస్ కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న బన్నీ నెక్స్ట్ కొరటాల శివతో కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుండో వీరిద్దరూ కలిసి పనిచేయాలనే ఆలోచనలో ఉన్నారు. స్క్రిప్ట్ రెడీ చేస్తే మూవీ చేద్దాం అని బన్నీ ఎప్పుడో కొరటాల శివకు హామీ కూడా ఇచ్చారట.

ప్రస్తుతం కొరటాల ఆచార్య మూవీ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు 50శాతం వరకు పూర్తి అయినది. షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయిన వెంటనే ఆచార్య సెట్స్ పైకి వెళ్లనుంది. ఆచార్య తరువాత కొరటాల చేసే చిత్రం కూడా బన్నీతోనే అన్న మాట వినిపిస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఆచార్య మూవీకి బ్రేక్ పడడంతో కొరటాల బన్నీ కోసం ఓ మంచి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. సోషల్ సబ్జెక్టుకు కమర్షియల్ అంశాలు జోడించి కొరటాల ఆ స్కిప్ట్ రాశారట.

కాగా ఈ ప్రాజెక్ట్ పై మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుందట. హిందీతో పాటు పలు భాషలలో విడుదల చేయాలనేది దర్శకుడు కొరటాల మరియు బన్నీ ప్లాన్ అట. ఇక సుకుమార్ తో చేస్తున్న పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విడుదల అవుతుండగా వరుసగా బన్నీ పాన్ ఇండియా చిత్రాలు ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus