Allu Arjun: పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ అలాంటి ఫోటో షేర్ చేసిన బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తూ తనకంటూ కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఇలా సినిమా షూటింగ్ సమయంలో తనకు ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడానికి ఎంజాయ్ చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఈయన తప్పనిసరిగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. ఇకపోతే అల్లు అర్జున్ ఇలాంటి వాటన్నింటిని పాటించడమే కాకుండా తన పిల్లలకు కూడా ఈ అలవాట్లను నేర్పుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావడంతో  (Allu Arjun) అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటి వాటికి నీళ్లు పోస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ విధంగా అల్లు అర్జున్ మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ ఎన్విరాన్మెంటల్ డే..మనందరం మన వంతుగా ఈ పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ ఈయన ఒక కొటేషన్ షేర్ చేశారు.

ఇలా పలువురికి స్ఫూర్తిని నింపుతూ పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే… అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం పుష్ప 2 సినిమా షూటింగ్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు ఫ్రీక్వెల్ చిత్రమైనటువంటి పుష్ప సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus