Pushpa: 5 బిలియన్ వ్యూస్ సాధించిన పుష్ప మ్యూజిక్ ఆల్బమ్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో అలరించాయని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్ కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.

ఇందులో శ్రీవల్లి పాట, సమంత నటించిన ఐటమ్ సాంగ్ , రష్మిక నటించిన రారా సామి అనే పాటలు విపరీతంగా అందరిని ఆకట్టుకున్నాయి. అలాగే ఇందులో అల్లు అర్జున్ మేనరిజం, బన్నీ చెప్పే డైలాగ్స్ అభిమానులను కట్టిపడేసాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సెలబ్రిటీలు కూడా తగ్గేదే లే అని సిగ్నేచర్ చేస్తూ సందడి చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకి ఎంతోమంది సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ సినిమా అందుకొని అరుదైన రికార్డ్ సృష్టించిందని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ఏకంగా 5 బిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కూడా ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఈ క్రమంలోనే ఫైవ్ బిలియన్ వ్యూస్ అంటే ఏకంగా 500 కోట్ల వ్యూస్ రావడం అంటే సర్వసాధారణమైన విషయం కాదు. ఈ విధంగా పుష్ప సినిమా ఇలాంటి రికార్డులను సృష్టించడంతో బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పుష్ప సినిమా ఈ స్థాయిలో రికార్డులను సృష్టించడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంపై మరెన్నో అంచనాలు పెరిగాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus