Pushpa: అల్లు అర్జున్ ‘పుష్ప’ అకౌంట్ లో మరో భారీ రికార్డు..!

అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇక ఈ మధ్యనే అంటే అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ‘పుష్ప రాజ్’ పాత్రను పరిచయం చేస్తూ ‘పుష్ప’ చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ ను విడుదల చేశారు. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది.

అల్లు అర్జున్ రా లుక్ లో సర్ప్రైజ్ చేసాడు. గూజ్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఎన్నో ఈ టీజర్లో ఉన్నాయి. దాంతో యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది ‘పుష్ప’ టీజర్. ఇక అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా ఎన్టీఆర్ అరుదైన రికార్డుని బ్రేక్ చేసిందట ‘పుష్ప’ టీజర్. విషయంలోకి వెళితే.. ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ వచ్చిన ఎన్టీఆర్ భీమ్ టీజర్ అయిన ‘రామరాజు ఫర్ భీమ్’ రికార్డులను ‘పుష్ప’ బ్రేక్ చేసిందట.

టాలీవుడ్లో అత్యధికంగా 1.2 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించిన టీజర్‌ గా ‘పుష్ప’ సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.అంతకు ముందు ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ 40 రోజుల్లో క్రియేట్ చేసిన ఈ రికార్డుని 11 రోజుల్లోనే బ్రేక్ చేసింది ‘పుష్ప’ టీజర్. అంతేకాదు 44+ మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసిన ఘనత కూడా ‘పుష్ప’దే కావడం విశేషం. రాజమౌళికి దీటైన పోటీ ఇచ్చేది సుకుమార్ మాత్రమే అని అందరూ అంటుంటారు. ఈ టీజర్లను బట్టి చూస్తుంటే అది నిజమే అని స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus