Allu Arjun: అలా అంచనాలు పెంచేస్తున్న బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఆగష్టు 13వ తేదీన ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుండగా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ప్రోమో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా బన్నీ పుష్పరాజ్ పాత్ర కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడంతో పాటు ఆ పాత్రలో జీవించారనే చెప్పాలి.

ఈ సినిమాతో బన్నీ మాస్ ఆడియన్స్ కు మరింత చేరువ కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సరైనోడు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు బన్నీకి మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెంచింది. క్రిస్మస్ పండుగ కానుకగా పుష్ప సినిమా రిలీజ్ కానుండగా బన్నీ కెరీర్ లో పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తన లుక్, డైలాగ్, మేనరిజమ్స్ తో పుష్ప మూవీపై బన్నీ అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పుష్పరాజ్ భార్య పాత్రలో రష్మిక నటిస్తుండగా ఈ సినిమాలో రష్మిక పాత్ర కొత్తగా ఉంటుందని సమాచారం. రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో ఊహించని ట్విస్ట్ తో పుష్ప పార్ట్1 క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏ భాష మాండలికం అయినా సులువుగా పలికించే సత్తా ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న బన్నీ పుష్పలో చిత్తూరు యాసలో మాట్లాడనున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus