‘పుష్ప’ చిత్రం హిందీలో రూ.100కోట్ల నెట్ ను సాధించిందట. నిన్నటి నుండీ ఈ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం అయితే ఆకాశమే హద్దు అన్నట్టు ఉంది. షేర్ పరంగా చూసుకుంటే రూ.47 కోట్ల వరకు ‘పుష్ప’ రాబట్టినట్టు తెలుస్తుంది. ‘బాహుబలి'(సిరీస్), ‘సాహో’ ల తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో రికార్డు కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘పుష్ప’ నిలిచింది. ‘పుష్ప’ టీం కూడా ఈ ఫీట్ సాధించినందుకు తెగ సెలబ్రేట్ చేసుకుంటుంది.
అయితే ఈ కలెక్టన్లు నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ నుండీ అందుతున్న సమాచారాన్ని బట్టి అయితే ఈ అనుమానాలు పీక్స్ కు వెళ్తున్నాయి. దాదాపు 4 వారాలకే ‘పుష్ప’ హిందీ వెర్షన్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ ఈ చిత్రం అక్కడ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది అని అక్కడి క్రిటిక్స్ మరియు ‘పుష్ప’ మేకర్స్ చెప్పుకుంటూ డప్పు కొడుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ రిలీజ్ అయ్యాక కూడా రూ.15కోట్ల పైగా నెట్ ను సాధించింది అంటున్నారు ‘పుష్ప’ టీం.
అయితే నార్త్ లో కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా థియేటర్లకు కూడా చాల ఆంక్షలు విధించారు. కొన్ని ఏరియాల్లో అయితే థియేటర్లు కూడా క్లోజ్ అయ్యాయి. థియేటర్లు రన్ అవుతున్న ప్రదేశాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ అవుతున్నాయి. ఇన్ని అడ్డంకుల నడుమ ‘పుష్ప’ రూ.100కోట్ల ఫీట్ ను ఎలా సాధించింది అనేది మనవళ్ల అనుమానం అయితే..! బాలీవుడ్ ట్రేడ్ సిర్కిల్స్ ‘వీటిలో సగం కూడా సాధ్యమైనట్టు లేదే… ఇంతకి మించి చెప్పకూడదు’ అనే అర్ధం వచ్చేలా హిందీలో చెబుతున్నారు. 4వ వారానికే క్లోజింగ్ అయ్యిందని కూడా వాళ్ళు హింట్ ఇచ్చారు.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!