Allu Arjun: బన్నీ తీరుపై మండిపడుతున్న మెగా ఫాన్స్?

గత కొన్ని సంవత్సరాల నుంచి వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసారా సినిమాతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ కొట్టారు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదలై కేవలం రెండు రోజులలోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇలా సుమారు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రెండు రోజులలోనే పెట్టుబడిని రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

ఈ విధంగా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకొని ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి అలాగే విజయ్ దేవరకొండ సైతం ప్రశంసల కురిపించగా తాజాగా బింబిసారుడిపై పుష్ప రాజ్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…

బింబిసారా చిత్ర బృందానికి బిగ్ కంగ్రాట్యులేషన్స్ అంటూ ఈయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.ఎంగేజింగ్ ఫాంటసీ ఫిల్మ్. బింబిసారుడిగా నందమూరి కల్యాణ్ రామ్‌ ఎంతో అద్భుతంగా నటించారు.కళ్యాణ్ రామ్ ఎప్పుడు ఇండస్ట్రీకి కొత్త తరహా టాలెంట్ ను పరిచయం చేయడమే కాకుండా విభిన్న కథలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. అందుకే ఆయన అంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు.

ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వశిష్ట పై కూడా ఈయన ప్రశంసలు కురిపించారు. ఈయన టేకింగ్ ఎంతో అద్భుతంగా ఉందని ఆర్టిస్టులు అందరినీ హ్యాండిల్ చేయడంలో సూపర్ కమాండ్ చేశారంటూ డైరెక్టర్ వశిష్ట పైఅల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఇలా కళ్యాణ్ రామ్ సినిమాపై బన్నీ ప్రశంసలు కురిపిస్తూ ఆయనంటే గౌరవం అని చెప్పడంతో మెగా అభిమానులు బన్నీ వ్యవహార శైలిపై మండిపడుతున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus