Allu Arjun: ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్.. వాళ్లతో పోలిస్తే బన్నీ గ్రేట్!

సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు కమర్షియల్ గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే కథ, కథనం పట్టించుకోకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సెలబ్రిటీలు సైతం చాలామంది ఉన్నారు. అయితే అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం వాళ్లతో పోలిస్తే తాను భిన్నమని ప్రూవ్ చేసుకున్నారు. 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసి నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. పుష్ప ది రైజ్ (Pushpa) సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న నేపథ్యంలో పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఒక ప్రకటనలో నటించడానికి బన్నీకి ఆఫర్ వచ్చింది.

ఈ ఆఫర్ కు ఓకే చెబితే ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా బన్నీ మాత్రం డబ్బు గురించి అస్సలు పట్టించుకోకుండా తాను ఆ యాడ్ లో నటించబోనని తేల్చి చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఫ్యాన్స్ ఆరోగ్యానికి నష్టం కలిగించే, ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టించే యాడ్స్ లో తాను నటించే ఛాన్స్ లేదని బన్నీ చెప్పారట. వరల్డ్ టొబాకో డే సందర్భంగా బన్నీ కొంతకాలం క్రితం చెప్పిన ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

బన్నీ రీల్ హీరో మాత్రమే కాదని రియల్ హీరో అని ఈ హీరో తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. అలాంటి యాడ్స్ లో నటిస్తూ ఫ్యాన్స్ ఆరోగ్యానికి నష్టం కలగడానికి పరోక్షంగా కారణమవుతున్న హీరోలతో పోల్చి చూస్తే బన్నీ ఎన్నో రెట్లు పైస్థాయిలో ఉంటారని ఈ హీరో ఎంతో గ్రేట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

పుష్ప ది రూల్ లో (Pushpa2) బన్నీ పొగాకు ఉత్పత్తులు తాగే సమయంలో బ్యాగ్రౌండ్ లో ఆ సంస్థ బ్రాండ్ లోగో కనిపించాలని సంస్థ ప్రతినిధులు కోరినా బన్నీ నో చెప్పారట. పుష్ప ది రూల్ మూవీ ఆగష్టు నెల 15వ తేదీన రిలీజ్ కానుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus