Allu Arjun: రూ.100 కోట్ల ఆఫర్ ను బన్నీ కాదన్నాడా..?

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా నార్త్ లో కూడా బాగా ఆడడంతో పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. ‘పుష్ప ది రూల్’ అనే పేరుతో పార్టీ 2ని తెరకెక్కించనున్నారు.

దర్శకుడు సుకుమార్ పక్కా స్క్రిప్ట్ తో వర్క్‌తో పార్ట్-2 కోసం రంగంలోకి దిగుతున్నారు. పార్ట్-1ను మించి పుష్ప-2 తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు కానీ అప్పుడే ఈ సినిమాకి క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందట.

నిజానికి ఇది క్రేజీ డీల్ అనే చెప్పాలి. నిర్మాతలు కూడా ఈ డీల్ పై ఆసక్తి చూపించారు కానీ అల్లు అర్జున్ మాత్రం రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ కి ముందు ఎలాంటి డీల్స్ పెట్టుకోవద్దని చెప్పారట. ఒక్కసారి సినిమా పూర్తయి బజ్ వచ్చిన తరువాత అప్పుడు బిజినెస్ ప్లాన్స్ చేద్దామనేది బన్నీ ఆలోచన.

దీంతో నిర్మాతలు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడే ఈ రేంజ్ లో ఆఫర్స్ వస్తే.. సినిమా రిలీజ్ సమయానికి బిజినెస్ మరింత ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఇందులో దాదాపు వంద కోట్లు బన్నీకి రెమ్యునరేషన్ గా ఇవ్వబోతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్ లోనే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus