Allu Arjun: బాలీవుడ్ ఆఫర్ కు నో చెప్పిన బన్నీ… కారణం..?

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 10 ఏళ్ళ తర్వాత ‘పఠాన్’ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చిన షారుఖ్… ‘జవాన్’ తో అంతకు మించిన బ్లాక్ బస్టర్ కొట్టి తన అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ‘మెర్సెల్’ ‘బిగిల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా కావడం అలాగే నయనతార, విజయ్ సేతుపతి వంటి స్టార్లు ఈ మూవీలో నటిస్తుండడం కూడా అందరిలో ఆసక్తిని పెంచిందని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ‘జవాన్’ చిత్రంలో 15 నిమిషాల ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఇటీవల అల్లు అర్జున్ ను సంప్రదించింది చిత్ర బృందం. అయితే అల్లు అర్జున్ వెంటనే నో చెప్పకపోవడంతో ఈ సినిమాలో నటించడానికి అతను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా అతను ఈ ప్రాజెక్టుకి నో చెప్పేసినట్టు సమాచారం. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2′(పుష్ప ది రూల్) లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ ఫినిష్ అయ్యాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఊర నాటు లుక్ లోకి మారాడు. అతని స్కిన్ డార్క్ గా చేసుకున్నాడు. హెయిర్ కూడా ఆ పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇప్పుడు ‘జవాన్’ కోసం అతను లుక్ మార్చుకునే అలోచోనలో లేడు అని తెలుస్తుంది.పైగా అతను ‘జవాన్’ చేసి వస్తే ‘పుష్ప2’ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus