Allu Arjun Remuneration: వామ్మో.. బన్నీకి అన్ని కోట్లు ఇస్తున్నారా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమాకి భారీ క్రేజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ రేంజ్ కి కూడా రీచ్ అయింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ తో ఎన్నో రీల్స్ వచ్చాయి. సెలబ్రిటీలు సైతం బన్నీని ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేశారు. ‘తగ్గేదేలే’ అనే ఒక్క డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ తో అటు బన్నీ, ఇటు సుకుమార్ ఇద్దరూ రెమ్యునరేషన్స్ పెంచేశారు. ‘పుష్ప ది రూల్’ సినిమా కోసం బన్నీకి రూ.90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. బిజినెస్ లో వాటాతో కలుపుకొని ఇంత మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యారట నిర్మాతలు. దర్శకుడు సుకుమార్ కూడా ‘పుష్ప’ పార్ట్ 2 కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. మొదటి పార్ట్ కి రూ.18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ ఈసారి రూ.45 నుంచి యాభై కోట్ల వరకు తీసుకోబోతున్నారట.

వీరు కాకుండా ఆర్టిస్ట్ లు, సాంకేతికనిపుణులతో కలుపుకొని రూ.50 నుంచి రూ.75 కోట్లు రెమ్యునరేషన్స్ కి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే రెమ్యునరేషన్స్ కోసమే రెండొందల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. మేకింగ్ కోసం మరో రూ.150 కోట్లు వెచ్చించబోతున్నారు. ఆ విధంగా ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట నిర్మాతలు. మేకింగ్ సమయంలో ఈ బడ్జెట్ పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus