Allu Arjun: పుష్ప-2కు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • August 31, 2023 / 02:44 PM IST

డాడీ సినిమాలో మెరుపులా మెరిసిన ఆణిముత్యం అల్లు అర్జున్. సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు. తాజాగా పుష్ప సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికై మొదటిసారి నేషనల్ అవార్డు అందుకుంటున్న హీరోగా తెలుగు ఇండస్ట్రీలో నిలిచారు. లెక్కల మాస్టార్ సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా విడుదలై ఇప్పటికి రెండేళ్లు కావస్తుంది. సినిమా విడుదలైన ఫస్ట్ రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తర్వాత హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సినిమా పాటలు ఇప్పటికీ మార్మోగిపోతున్నాయి. పాన్ ఇండియాల లెవల్లో దాదాపుగా రూ.350 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది పుష్ప సినిమా. ప్రస్తుతం దాని సీక్వెల్ పుష్ప-2 సినిమా షూటింట్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర దర్శకుడు సుకుమార్ మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ పై మరింత శ్రద్ధ పెట్టారు. ఇటీవలే ఆ సినిమాకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభిస్తోంది.

దీనికి తోడు బన్నీకి జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ వచ్చింది. పుష్ప ఫస్ట్ పార్టుకు అల్లు అర్జున్ దాదాపుగా రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ సెకండ్ పార్టుకు మాత్రం డబుల్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక్క చిత్రానికి రూ .150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా.. అల్లు అర్జున్ కూడా అంతే డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

వాటితో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని ఏరియా హక్కులను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్లు కూడా అల్లు అర్జున్ (Allu Arjun) తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి అందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus