Allu Arjun: ‘పుష్ప’ టైటిల్ కహాని చెప్పుకొచ్చిన అల్లు అర్జున్!

సుకుమార్  (Sukumar) – అల్లు అర్జున్ (Allu Arjun)  కాంబినేషన్ అంటే.. దానిపై ప్రేక్షకులు ప్రత్యేక దృష్టి పెడతారు. ఎందుకంటే వీళ్ళ కాంబోలో వచ్చిన ‘ఆర్య’ (Aarya) ‘ఆర్య 2’ (Aarya 2) చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ‘పుష్ప’ (Pushpa) పై మొదటి నుండి మంచి హైప్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి మొదట్లో ‘శేషాచలం’ అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘పుష్ప’ అనే టైటిల్ ని పెట్టారు. తర్వాత దాన్ని రెండు పార్టులుగా స్ప్లిట్ చేశారు.

Allu Arjun

అయితే టైటిల్ విషయంలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ సినిమాకి ఓ సాయం చేశారట. ఈరోజు ముంబైలో జరిగిన ఈవెంట్లో హీరో అల్లు అర్జున్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి మేము ముందుగా ‘పుష్ప’ అనే టైటిల్ అనుకున్నాం. ఒక టైంలో మేము టైటిల్ రివీల్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నాకు, సుకుమార్ కి కామన్ ఫ్రెండ్ అయినటువంటి టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి.. ‘పుష్ప’ టైటిల్ గురించి చెప్పాము.

సాధారణంగా తెలుగులో ‘పుష్ప’ అంటే ఫ్లవర్(పువ్వు). సో హరీష్.. ‘టైటిల్ చాలా సాఫ్ట్ గా ఉంది. మీది మాస్ సినిమా అంటున్నారు. ఎలా సెట్ అవుతుంది.ఫ్యాన్స్, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు?’ అని నన్ను అడిగారు. ఆ విషయాన్ని మా డైరెక్టర్ సుకుమార్ దగ్గర ప్రస్తావించాను. అప్పుడు ‘ఆయన కేవలం టైటిల్ మాత్రమే కాకుండా.. నా లుక్ తో కలిపి పోస్టర్ ను రిలీజ్ చేద్దాం’ అని చెప్పారు.

చాలా రఫ్ గా కనిపిస్తున్న హీరోకి ‘పుష్ప’ అనే సాఫ్ట్ టైటిల్ చాలా భిన్నంగా ఉంటుంది. సో అప్పుడు టైటిల్ గురించి పట్టించుకోకుండా కథ గురించి ఆడియన్స్ ఆలోచిస్తారు అని సుకుమార్ చెప్పారు. అలా విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది” అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags