Subbaraju: నటుడు సుబ్బరాజు భార్య గురించి ఆసక్తికర విషయాలు!

  • November 29, 2024 / 01:11 PM IST

‘పెళ్ళి జరగడం వేరు.. పెళ్ళి చేసుకోవడం వేరు..! పెళ్లి చేసుకోవడానికి ఒక అవసరం రావాలి. పెద్దల కోసం పెళ్ళి చేసుకుని తర్వాత ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు’ గతంలో సుబ్బరాజు  (Subbaraju) పెళ్లి గురించి చెప్పిన మాటలు ఇవి. అతను చెప్పిన ఈ మాటలను బట్టి అయితే.. సుబ్బరాజు కూడా పెళ్ళి చేసుకోడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల అతను సైలెంట్ గా పెళ్ళి చేసుకుని షాకిచ్చాడు. చాలా సైలెంట్ గా పెళ్ళి చేసుకుని.. తన భార్యతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Subbaraju

అవి చూసి అంతా షాక్ అయ్యారు. ఇక మరోపక్క సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా? చాలామంది సోషల్ మీడియాలో డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె పేరు స్రవంతి అని తెలుస్తుంది. చాలా సంవత్సరాల క్రితమే ఈమె ఫ్యామిలీ హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. కొలంబియా యూనివర్శిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నుండి స్రవంతి బీడీఎస్, డీడీఎస్, ఎంపీ హెచ్ పొందారు.

ప్రస్తుతం ఆమె ఫ్లోరిడాలోని నార్త్ వుడ్ డెంటల్ సెంటర్స్ లో డెంటిస్ట్ గా పని చేస్తున్నారని సమాచారం. కొన్నేళ్ల నుండి సుబ్బరాజు, స్రవంతి..లు ప్రేమలో ఉన్నారట. ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒకటయ్యారు తెలుస్తుంది. అమెరికాలో వీరి పెళ్ళి చాలా సింపుల్ గా జరిగింది. మొదటి నుండి సుబ్బరాజు చాలా సింపుల్ గా ఉంటాడు. ఎటువంటి ఆడంబరాలకు పోడు.

పెళ్ళి కూడా అలాగే సింపుల్ గా చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇక హైదరాబాద్లో తన బంధుమిత్రులు, స్నేహితుల కోసం చిన్నపాటి రిసెప్షన్ ను ఏర్పాటు చేయాలని సుబ్బరాజు భావిస్తున్నాడు. దీనికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను (Prabhas)  ఆహ్వానించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ వేడుకకు కూడా మీడియాని దూరంగా ఉంచాలని సుబ్బరాజు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.

డిప్రెషన్‌ గురించి ఏఆర్‌ రెహమాన్‌ చిట్కాలు.. అలా చేస్తే సరి అంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus