Allu Arjun: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు బాలీవుడ్ సినిమాలలో నటించాలని భావిస్తున్నారు. హిందీ సినిమాలలో నటించడం ద్వారా క్రేజ్ పెరుగుతుందని టాలీవుడ్ హీరోలు అనుకుంటున్నారు. అయితే బన్నీ మాత్రం బాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. బాలీవుడ్ లో నటించడం నాకు కంఫర్ట్ కాదని బన్నీ తాజాగా షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం. కంఫర్ట్ కాకపోయినా అవసరం అనుకుంటే హిందీ సినిమాలలో చేస్తానని బన్నీ వెల్లడించారు. అప్పుడు మాత్రం నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతానని బన్నీ కామెంట్లు చేశారు.

నాకు హిందీ సినిమాలో ఆఫర్ వచ్చిందని బన్నీ తెలిపారు. అయితే ఆ కథ ఏ మాత్రం ఆసక్తికరంగా లేదని బన్నీ చెప్పుకొచ్చారు. ఈ కారణం వల్లే ఆ ఛాన్స్ ను వదులుకున్నానని బన్నీ కామెంట్లు చేశారు. మంచి కథ దొరికితే మాత్రం హిందీలో చేస్తానని అనుకుంటున్నానని బన్నీ వెల్లడించారు. బాలీవుడ్ లో చేయాలంటే ధైర్యం కావాలని బన్నీ అన్నారు. బన్నీ నటించిన పుష్ప ది రైజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిందనే సంగతి తెలిసిందే.

2021లో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం. ఈ సినిమాలో బన్నీ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించగా పుష్ప ది రైజ్ సక్సెస్ తో వీళ్లిద్దరికీ ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ ఊహించని స్థాయిలో పాపులర్ అయింది. సినిమాసినిమాకు హీరోగా అల్లు అర్జున్ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం. అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

బన్నీ క్రేజ్ ను చూసి ఇతర ఇండస్ట్రీల హీరోలు సైతం షాక్ కు గురవుతున్నారు. బన్నీ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus