Allu Arjun: ఆ డైరెక్టర్ ను బెదిరించిన బన్నీ.. ఏమైందంటే?

క్లాస్ రోల్స్ అయినా మాస్ రోల్స్ అయినా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ప్రశంసలు అందుకునే హీరోగా అల్లు అర్జున్ కు పేరుంది. తాజాగా అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. 18 పేజెస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ 18 పేజెస్ మూవీ నా మనసుకు దగ్గరైన మూవీ అని అన్నారు. నాకెంతో ఇష్టమైన సుకుమార్ కథ అందించిన మూవీ 18 పేజెస్ అని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు.

18 పేజెస్ మూవీ చూసిన తర్వాత సుకుమార్ నిర్మాతగా నాతో కూడా ఒక సినిమా చేస్తే బాగుంటుందని అనిపించిందని దర్శకుడు సూర్యప్రతాప్ ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడని బన్నీ కామెంట్లు చేశారు. హ్యాపీడేస్ మూవీ నుంచి నిఖిల్ ను చూస్తున్నానని నిఖిల్ మంచి కథలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడని బన్నీ పేర్కొన్నారు. ఈ సినిమాతో కూడా నిఖిల్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ కామెంట్లు చేశారు.

18 పేజెస్ మూవీకి గోపీసుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని గోపీ సుందర్ తో కలిసి పని చేయాలని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. పుష్ప2 గురించి ఒకటే మాట చెబుతున్నానని ఈసారి అస్సలు తగ్గేదేలే అని బన్నీ పేర్కొన్నారు. త్వరలో పుష్ప2 గురించి అప్ డేట్ ఇస్తానని అల్లు అర్జున్ తెలిపారు. సుకుమార్ లేకపోతే తాను లేనని ఈ సినీ కెరీర్ సుకుమార్ ఇచ్చిందేనని బన్నీ అభిప్రాయపడ్డారు.

పుష్ప2 సినిమాకు సంబంధించి అప్డేట్ ఇవ్వకపోతే నేనే ఆ సినిమా డైలాగ్స్ చెప్పేస్తానని బన్నీ సుకుమార్ ను బెదిరించడం గమనార్హం. అతి త్వరలో పుష్ప2 మూవీ అప్డేట్ వస్తుందని బన్నీ చెప్పకనే చెప్పేశారు. బన్నీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప2 కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తుండగా ఆ ఖర్చుకు తగిన ఫలితం వస్తుందో లేదో చూడాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus