మాస్ పల్స్ తెలిసిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. సినిమా కథల ఎంపికలోనే కాదు… ప్రెస్ మీట్, ఈవెంట్లలో మాటల సమయంలోనూ ఆయన ఆ పల్స్ టాలెంట్‌ను చూపిస్తూ ఉంటారు. దీంతో ఆయన ఫ్యాన్స్, సగటు ప్రేక్షకులు ఆ మాటలకు ముచ్చటపడిపోతూ ఉంటారు. తాజాగా ‘బేబీ’ సినిమా సక్సెస్ మీట్‌లోనూ అల్లు అర్జున్ ఇలానే మాట్లాడాడు. సినిమా గురించి, నటీనటుల గురించి గొప్పగా చెబుతూ… హైదరాబాద్‌లో తన థియేటర్‌లో ఉన్న ఏరియాను టచ్ చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేశాడు. దీంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి.
ప్రేమలో ఉన్న బాధను చూపించే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సినిమాలు తీయాలంటే కష్టం. సినిమాలు చూసో, స్క్రీన్‌ప్లే పుస్తకాలు చదివో ఇలాంటివి రాయలేం. జీవితాన్ని అనుభవించి రాస్తేనే అలాంటి చిత్రాలొస్తాయి. ‘బేబీ’ కూడా అలాంటి సినిమానే. సినిమా చూశాక అమీర్‌పేటలో ఆటో కుర్రాళ్లలా ఫీల్ అయ్యా అంటూ కామెంట్స్ చేశాడు అల్లు అర్జున్. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఆ మాస్ మాటలు అలా ఉన్నాయి మరి. కానీ కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఇటీవల ‘ఏఏఏ’ పేరుతో అమీర్ పేటలో ఓ మల్టిప్లెక్స్ లాంచ్ చేశాడు. అందుకే ఆ ఏరియా పేరును ప్రస్తావించాడు అంటూ కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే హైదరాబాద్ ఆటో కుర్రాళ్ల అంటే సరిపోయేది కదా.. అమీర్ పేట అన్నాడంటే అందుకే అంటున్నారు. మరికొందరు అయితే ఏదో అలా అనేసుంటాడు అని అంటున్నారు. ఆ చర్చ పక్కనపెడితే..
ఇదే వేదిక మీద తెలుగులో తెలుగు కథానాయికలు పెద్దగా కనిపించడం లేదేంటన్న ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చాడు బన్నీ. శ్రీలీల, వైష్ణవి చైతన్య రాకతో టాలీవుడ్‌లో తెలుగుమ్మాయిలకు టైం వచ్చింది అనిపించింది. వీళ్లను చూసి మరింతమంది ముందుకు వస్తారు అనేలా మాట్లాడాడు. మరి ఆయన మాటలకు తగ్గట్టుగా కొత్త వాళ్లు వచ్చి, మన వాళ్లు అవకాశాలు ఇస్తే ఇంకా బాగుంటుంది.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు