కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పమంటే.. పెద్ద షాక్ ఇచ్చాడుగా

మహేష్ బాబుతో ఎనౌన్స్ చేసిన సినిమా ఆపేసి మరీ అల్లు అర్జున్ తో ప్రొజెక్ట్ ను మొదలెట్టినప్పట్నుంచి ఆ సినిమా గురించి రకరకాల న్యూస్ లు వస్తూనే ఉన్నాయి. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ను ఇటీవల సుకుమార్ నేరేట్ చేశాడట. సాధారణంగానే అద్భుతమైన స్టోరీ టెల్లర్ అయిన సుకుమార్.. చాలా టైమ్ తీసుకొని రెడీ చేసిన స్క్రిప్ట్ కావడంతో.. ఈ థ్రిల్లర్ ను అల్లు అర్జున్ ఊహించని రీతిలో నెరేట్ చేశాడట. సుకుమార్ క్రియేటివిటీ మాత్రమే ఎక్స్ పెక్ట్ చేసే అల్లు అర్జున్ ఈ నెరేషన్ లో ఆయన రాసుకొన్న ట్విస్టులకు షాక్ అయిపోయాడట.

త్రివిక్రమ్ సినిమా కాకినాడ షెడ్యూల్ తోపాటు.. హైద్రాబాద్ లో ప్లాన్ చేసిన మరో షెడ్యూల్ పూర్తయిన తర్వాత వెంటనే సుకుమార్ సినిమా స్టార్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడట అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ ను అంతగా షాక్ కు గురిచేసిన ఆ స్క్రిప్ట్ ఏమిటో అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus