Allu Arjun: బన్నీ ఆ గాయాన్ని ఇంకా మరిచిపోలేదా..?

గంగోత్రి సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్ సినీ కెరీర్ లో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు చాలానే ఉన్నా ఇండస్ట్రీ హిట్ సాధించాలనే కోరిక మాత్రం అల వైకుంఠపురములో సినిమాతో తీరింది. నా పేరు సూర్య రిజల్ట్ తో నిరాశపడిన బన్నీ అల వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రాగా తన భవిష్యత్ సినిమాలు ఆ సక్సెస్ రేంజ్ ను మరింత పెంచేలా ఉండాలని బన్నీ భావిస్తున్నారని తెలుస్తోంది. గత కొన్నిరోజుల నుంచి కొందరు మిడిల్ రేంజ్ డైరెక్టర్లతో బన్నీ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

అయితే బన్నీ మాత్రం పాన్ ఇండియా డైరెక్టర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టారని సమాచారం. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప పాన్ ఇండియా మూవీ కాగా బన్నీ తరువాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో కూడా బన్నీ ఇప్పటికే చర్చలు జరపగా అటు బన్నీ నుంచి కానీ ఇటు ప్రశాంత్ నీల్ నుంచి కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదనే సంగతి తెలిసిందే.

మరోవైపు బన్నీ పైకి చెప్పకపోయినా రాజమౌళి డైరెక్షన్ లో నటించారని ఆశ పడుతున్నారని సమాచారం. రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాజమౌళి మహేష్ కాంబో సినిమా తరువాత బన్నీ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో బన్నీ కాంబినేషన్ లో కూడా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ డైరెక్టర్లతో పాటు కొందరు కోలీవుడ్ డైరెక్టర్లపై కూడా బన్నీ దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను సంపాదించుకోవాలని భావిస్తున్న అల్లు అర్జున్ కు ఆ సినిమాతో ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. నా పేరు సూర్య రిజల్ట్ ను బన్నీ మరిచిపోలేదని సినిమాల బడ్జెట్లు, పారితోషికాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రిస్క్ తీసుకోవడానికి బన్నీ సిద్ధపడటం లేదని సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus