అల్లు అర్జున్ పుట్టినరోజులు ఇన్నాళ్లూ ఒక లెక్క… ఇప్పుడు ఇంకో లెక్క. ఎందుకంటే ఈ సారి పుట్టిన రోజుకు ‘పుష్ప’రాజ్ మళ్లీ వస్తున్నాడు. ‘పుష్ప: ది రూల్’ (Pushpa2) సినిమా నుండి ఈ నెల 8న స్పెషల్ సర్‌ప్రైజ్ ఉంటుంది అని టీమ్ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు ఓ టీజర్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌తోనే హైప్ ఓ రేంజిలో ఎక్కితే… ఇప్పుడు అంతకుమించి ఉంటుంది అంటూ మరో హైప్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం.
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తాం అని టీమ్ ఇప్పటికే చెప్పింది. అంటే మరో నాలుగు నెలలు ఉంది. అయినా బన్నీ జన్మదినాన్ని మించిన రోజు లేదు అనుకుంటూ సినిమా ప్రచారాన్ని షురూ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రచారం ఉండకపోయినా ఈ నెల 8 నుండి ఏదో రకంగా సినిమా గురించి బయట మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేస్తోందట. సెన్సేషనల్ మ్యూజిక్‌తో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కూడా సిద్ధమయ్యారట.
సుకుమార్, అల్లు అర్జున్ (Allu Arjun), దేవిశ్రీ ప్రసాద్ కలిసి దిగిన ఓ ఫొటోను మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేస్తూ… ‘హెడ్‌ఫోన్స్ రెడీ చేసుకోండి. ‘పుష్ప2’ టీజర్‌కు సెన్సేషనల్ బీజీఎం రాబోతోంది’ అని రాసుకొచ్చింది. దానికి బన్నీ అభిమానులు ‘కొత్త హెడ్ ఫోన్స్ కొనుక్కుంటాం… మ్యూజిక్‌తో దద్దరిల్లేలా చేయాలి’ అని కామెంట్లు చేస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో పాటలు ఏ స్థాయిలో హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించి ఉండేలా చూసుకుంటున్నారట.
‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) సినిమాలో అన్ని పాటలు కుర్రకారు నోళ్లలో నానాయి. ఇక సెలబ్రిటీలు సైతం ఆ పాటలకు రీల్స్ చేసి సందడి చేశారు. క్రీడా మైదానాల్లో కూడా ఆ పాటలకు స్టెప్పులు ఇప్పటికీ వేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సినిమాకు సీక్వెల్‌గా వచ్చే సినిమాలో ఇంకెలాంటి పాటలు ఉంటాయో, ఎంతటి సందడి చేస్తాయో చూడాలి.