ఈ వారం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) అనే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఏ రకంగా చూసినా ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ అదే. అయినప్పటికీ పక్కన కొన్ని చిన్న మరియు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘భరతనాట్యం’ (Bharathanatyam) అనే సినిమా ఒకటి. ట్రైలర్ చూస్తే ఇదేదో కళాతపస్వి కె.విశ్వనాథ్ (K. Vishwanath) గారి స్టైల్లో తీసిన డాన్స్ మూవీ ఏమో అనే డౌట్ వస్తుంది. ‘కానీ కాదు’ అని టీజర్, ట్రైలర్స్ ప్రూవ్ చేశాయి. మరి సినిమా ఇంకెలా ఉందో తెలుసుకుందాం రండి :
కథ : రాజు సుందరం(సూర్య తేజ ఏలే) (Surya Teja Aelay) సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ మరోపక్క డైరెక్షన్ ట్రయిల్స్ వేసుకుంటాడు. పేద కుటుంబం నుండి వచ్చిన అతనికి ఆర్ధిక ఇబ్బందులు బాగా ఎక్కువ. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పటికీ అతని వద్ద డబ్బు ఉండదు. మరోపక్క అతని తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకోపక్క అతని గర్ల్ ఫ్రెండ్(మీనాక్షి గోస్వామి) పెళ్లి చేసుకోమని పట్టుబడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజు సుందరం ఏదైనా తప్పు చేసి డబ్బు సంపాదించాలి.. తద్వారా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుంటాడు.
ఇలాంటి టైంలో దిల్ షుఖ్ నగర్ దామోదర్(హర్షవర్ధన్) (Harsha Vardhan) రంగమతి(టెంపర్ వంశీ)(Temper Vamsi) ..లు అక్రమంగా తరలిస్తున్న భగతనాట్యం అనే డ్రగ్స్ బ్యాగ్ ను.. డబ్బులు ఉన్న బ్యాగ్ ఏమో అని కన్ఫ్యూజ్ అయ్యి కొట్టేస్తాడు. కానీ తర్వాత అది డ్రగ్స్ బ్యాగ్ అని తెలిసి వదిలించుకునే ప్రాసెస్ లో శకుని(అజయ్ ఘోష్) (Ajay Ghosh) అనే పోలీస్ కి దొరికిపోతాడు. ఓ పక్క దామోదర్ ఇంకో పక్క శకుని..ల నుండి రాజు సుందరం ఎలా తప్పుకున్నాడు? చివరికి అతని ఫ్యామిలీ ఏమైంది? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : సూర్య తేజ ఏలే కి హీరోగా ఇది తొలి సినిమా. కాబట్టి.. పక్కన వైవా హర్ష (Viva Harsha) , హర్ష వర్ధన్ వంటి సీనియర్స్ ని పెట్టి మ్యానేజ్ చేసే టెక్నిక్ వాడారు. ముందుగా సూర్య తేజ ఏలే విషయానికి వస్తే.. నటన పరంగా అతను బాగా పరిణితి చెందాల్సి ఉంది. అతని పాత్రకు డబ్బింగ్ చెప్పించారు.అది సరిగ్గా సింక్ అవ్వలేదు. అన్ని సీన్లకి ఒక్కటే ఎక్స్ప్రెషన్ తో మ్యానేజ్ చేయాలనుకుని చాలా ఇబ్బంది పడ్డాడేమో అనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. మీనాక్షి గోస్వామి.. ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుండా గెస్ట్ గా అక్కడక్కడా మెరిసింది అని చెప్పాలి.
వైవా హర్ష, హర్ష వర్ధన్ ..లు కొంతలో కొంత సీరియస్ గా కనిపిస్తూనే నవ్వించే ప్రయత్నం చేశారు. అన్నట్టు ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు కృష్ణుడు (Krishnudu) రీ ఎంట్రీ ఇచ్చాడు. అయినప్పటికీ అతని పాత్ర కూడా సరిగ్గా పండలేదు. ఇక ‘టెంపర్’ వంశీ కూడా ఎప్పటిలానే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో కానిచ్చేశాడు.అజయ్ ఘోష్ ఉన్నంతలో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు : ‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కెవిఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. హీరో సూర్య తేజ ఏలే ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించాడు. సో ఇక్కడే అందరికీ ఓ డౌట్ వచ్చేస్తుంది. కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడా? లేక జస్ట్ పేరు వేసుకుని అతనికి పారితోషికం ఇచ్చారా అని? ఎందుకంటే ఏ దశలోనూ ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్ వరకు అసలు కథ ఏంటి? అనేది తెలియక నెత్తి కొట్టుకునే పరిస్థితిలో ప్రేక్షకుడు ఉంటాడు.
ఒక్క సన్నివేశం కూడా సందర్భానుసారం తెరపైకి వస్తున్న ఫీలింగ్ కలగదు. సెకండ్ హాఫ్ గురించి ఇక అస్సలు చెప్పనవసరం లేదు. నిర్మాత పాయల్ సరాఫ్ సినిమాకి డబ్బులు బాగా పెట్టినట్లు ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టు బాగానే ఉన్నాయి. వెంకట్ ఆర్ శాకమూరి (Venkat R. Shakamuri) సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అంతకు మించి ఈ సినిమాలో హైలెట్ అని చెప్పుకోవడానికి ఒక్క పాయింట్ కూడా లేదు.
విశ్లేషణ : ‘భరతనాట్యం’… ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో రాసుకున్న ఓ క్రైమ్ కామెడీ కథ. కానీ ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేవు. ఎంతో ఓపిక ఉంటే తప్ప ఈ సినిమాని థియేటర్లో కూర్చుని చూడడం చాలా కష్టం.
రేటింగ్ : 1/5
Rating
1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus