బన్నీ, సుక్కూ.. సినిమా స్టోరీ అదేనట..!

అల్లు అర్జున్, సుకుమార్.. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు..! వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమా ఫార్మాట్ ను మార్చేసిన సినిమాల్లో ‘ఆర్య’ కూడా ఒకటి..! అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘ఆర్య2’ మాత్రం ఆ స్థాయిలో హిట్టవ్వలేదనే చెప్పాలి. అయితే వీళ్ళ ప్రయత్నానికి మాత్రం మంచి ‘అప్లాజ్’ వచ్చిందనే చెప్పాలి. ఇక వీరి కాంబినేషన్లో మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు 10 ఏళ్ళ నుండీ ఎదురుచూస్తూనే ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు సినిమా మొదలైంది. ‘అల్లు అర్జున్ 20’ వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది.

‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇక ఈ చిత్రం కథ ఇదేనంటూ పెద్ద చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లాలో ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుందనేది అందరికీ తెలిసిన సంగతి. ఒక్క ‘వీరప్పన్’ సినిమాలో తప్ప.. ఈ స్మగ్లింగ్ కాన్సెప్ట్ ను మరో దర్శకుడు టచ్ చేయలేదు. ఇంతకాలానికి మళ్ళీ మన లెక్కల మాస్టారు అయిన సుకుమార్ ఎంచుకున్నాడు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడట. పక్కా ‘రా లుక్’ లో బన్నీ కనిపిస్తాడని సమాచారం. అయితే ఇతనికి పోలీసులు, ప్రభుత్వం, మరో గ్యాంగ్ నుండీ ఇబ్బందులు ఎదురవుతాయట. అప్పుడు వాటిని హీరో ఎలా ఎదుర్కొంటాడు. అంతేకాదు చివరికి మనసు మార్చుకుని జనజీవన స్రవంతిలో ఎలా కలిసిపోతాడు.. అసలు హీరోలో ఈ మార్పు రావడానికి కారణమెవరు..? అన్నదే అసలలైన ట్విస్ట్ అని తెలుస్తుంది. మరి ఈ కథలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus