Allu Arjun: బెస్ట్ ఫ్రెండ్ సినిమా కోసం ‘గీతా’ ని కదిలించిన అల్లు అర్జున్!

అల్లు అర్జున్ – నవదీప్ బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ‘ఆర్య 2 ‘ ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. చాలా సినిమా వేడుకల్లో వీరిద్దరూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు నవదీప్ సినిమా కోసం అల్లు అర్జున్ పెద్ద సాయమే చేస్తున్నాడు. విషయం ఏంటి అంటే.. ఈ వారం ‘సగిలేటి కథ’ అనే సినిమా రూపొందుతుంది.

రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకుడు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్ బయటకు వచ్చాయి. వాటికి పెద్దగా బజ్ అయితే ఏర్పడలేదు. కానీ టీం అయితే సినిమా మంచి ఫలితం అందిస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉంది.

నవదీప్ కూడా ఈ చిత్రం గురించి (Allu Arjun) అల్లు అర్జున్ కి చెప్పడం కొన్ని సీన్స్ చూపించడం జరిగిందట. దీంతో అల్లు అర్జున్ .. బన్నీ వాస్ ను రంగంలోకి దించడం.. తెలుగు రాష్ట్రాల్లో ‘సగిలేటి కథ’ ని ‘గీతా ఆర్ట్స్’ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేయనుంది. దీంతో ఈ వీకెండ్ కి రిలీజ్ అయ్యే సినిమాల్లో.. ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడే అవకాశం ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus