Allu Arjun, Boyapati Srinu: బోయపాటి మూవీలో బన్నీ పాత్ర ఇదేనా!

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలు క్లాస్ ప్రేక్షకులతో పోలిస్తే మాస్ ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతాయి. గత కొంత కాలంగా బన్నీ బోయపాటి శ్రీను కాంబో మూవీ గురించి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. అయితే బన్నీ పుష్ప పార్ట్2లో ఫిబ్రవరి నుంచి నటిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో ఈ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. అయితే పుష్ప పార్ట్2 తర్వాత మాత్రం ఈ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్యను తను తెరకెక్కించిన సినిమాలలో డ్యూయెల్ రోల్ లో చూపించారు. అయితే బన్నీని కూడా తన సినిమాలో డ్యూయెల్ రోల్ లో చూపించబోతున్నారని బోగట్టా. ఈ పాత్రలలో ఒక పాత్రలో బన్నీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. బన్నీ రేసుగుర్రం సినిమాలో కొంత సమయం పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించి మెప్పించారు. అయితే ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా మాత్రం బన్నీ నటించలేదు.

బోయపాటి శ్రీను సినిమాతో బన్నీ ఫ్యాన్స్ కు ఆ లోటు తిరుతుందేమో చూడాలి. బోయపాటి శ్రీను ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుందని సమాచారం. సినిమాలో మాస్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని బోయపాటి శ్రీను విజయాలను అందుకుంటున్నారు.

అఖండ సినిమాతో బోయపాటి శ్రీను కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు బోయపాటి శ్రీనుకు క్రేజ్ పెరుగుతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు హిందీలో యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను అందుకున్నాయి. పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని బోయపాటి శ్రీను సైతం భావిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus