విష్ణు మంచు చిత్రం ‘మోస‌గాళ్లు’ టీజ‌ర్ ఆవిష్క‌రించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శ‌నివారం ఉద‌యం విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న ‘మోస‌గాళ్లు’ సినిమా టీజ‌ర్‌ను ఆవిష్క‌రించారు. మోస‌గాళ్లు చేసిన కుంభ‌కోణం ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. ఇండియాలో మొద‌లై అమెరికాను వ‌ణికించిన 450 మిలియ‌న్ డాల‌ర్ల అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పాల్ప‌డినవారిని వైట్ హౌస్‌‌లో ఏర్పాటుచేసిన స‌మావేశంలో మాట్లాడుతూ యు.ఎస్‌. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించ‌డంతో ఈ టీజ‌ర్ మొద‌లైంది. ఆ మీటింగ్‌లో “మిమ్మ‌ల్ని క‌నిపెడ‌తాం. మిమ్మ‌ల్ని నాశ‌నం చేస్తాం. దీనికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి నేను రెడీగా ఉన్నాను, ప్రిపేర్ అయ్యాను” అని ట్రంప్ చెప్పారు.

ఆ వెంట‌నే క‌నిపించిన సీన్‌ ఈ ఐటీ స్కామ్ వెనుక ఉన్న మాస్ట‌ర్‌మైండ్స్ విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్ అని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తుంది. నోట్ల క‌ట్ట‌లు కుక్కిన బ్యాగ్‌ల మ‌ధ్య ఆ ఇద్ద‌రూ నిల్చొని క‌నిపించారు. “ఇది స‌రిపోతుంది క‌దా” అని కాజ‌ల్ అంటే, “ఆట ఇప్పుడే మొద‌ల‌య్యింది” అని చెప్తున్నారు విష్ణు. శ్యామ్ సి.ఎస్‌. ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌.. టీజ‌ర్‌లోని విజువ‌ల్స్‌ను మ‌రింత‌గా ఎలివేట్ చేస్తోంది. ‘మోస‌గాళ్లు’ చేసిన అతిపెద్ద భారీ స్కామ్ ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజ‌ర్ చూపించ‌డం, దానిపై ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రిస్తూ మాట్లాడ‌టంతో, సినిమాపై ఆస‌క్తి బాగా పెరిగి, ఆ స్కామ్ వెనుక క‌థేమిటో తెలుసుకోవాల‌నే కుతూహ‌లం క‌లుగుతోంది.

ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత‌ పెరిగాయి. ‘మోస‌గాళ్లు’ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానున్న‌ది. విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఈ చిత్రంలోని విశేషం. తెర‌పై ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ సూప‌ర్బ్‌గా ఉన్న‌ట్లు టీజ‌ర్‌తోనే అర్థ‌మైపోతోంది. బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.


బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus