మేటర్ ఉందా లేదా..?

అల్లు అర్జున్ దిల్ రాజు అండ్ టీమ్ పై కాస్త అప్సెట్ గా ఉన్నాడా అంటే నిజమే అంటున్నారు సినీ తమ్ముళ్లు. అసలు మేటర్ ఏంటంటే. అల్లు అర్జున్ హీరోగా వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. అంతేకాదు, సబ్జెక్ట్స్ కూడా ఇలాంటివే ఎంచుకుంటున్నాడు. రీసంట్ గా కొరటాల శివతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కి కూడా కమిట్ అయ్యాడు మనోడు. ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న తమిళ డైరెక్టర్స్ ని కూడా లైన్లో పెట్టేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐకాన్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డైరెక్టర్ వేణుశ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దిల్ రాజు రీసంట్ గా రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తో సినిమా కమిట్ అయ్యాడు.

ఇప్పుడు ఇదే అల్లు అర్జున్ అప్సెట్ కి కారణం అని అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. ఎప్పట్నుంచో దిల్ రాజు దగ్గర అల్లు అర్జున్ డేట్స్ ఉన్నాయి. పైగా శంకర్ సినిమా అంటే కాదనకుండా ఒప్పుకుంటాడు. పైగా ఇప్పుడు పుష్పతో ప్యాన్ ఇండియా రేంజ్ మార్కెట్ పై కన్నేశాడు బన్నీ. అలాంటిది ఒక్క మాట కూడా సంప్రదింపులు లేకుండా సినిమా ఎనౌన్స్ చేయడం పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు వేణుశ్రీరామ్ తోనే సినిమా చేయాలని దిల్ రాజు నుంచి ప్రషర్ వస్తున్నట్లుగా టాక్. అల్లు అర్జున్ స్క్రిప్ట్ లో ఆల్రెడీ కొన్ని ఛేంజస్ చేయమని చెప్పాడని, అవన్నీ అయిన తర్వాతే కమిట్ అవుదామని అంటున్నాడట. అంతేకాదు, వేణుశ్రీరామ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా తీయగలడా లేదా అనే డౌట్ కూడా ఫ్యాన్స్ లో ఉంది. పైగా అల్లు అర్జున్ డేట్స్ ఇస్తే ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడో కమిట్ అయిన డేట్స్ ఉండటం అనేది ఆసక్తికరంగా మారింది.

మరి అల్లు అర్జున్ దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ ప్రాజెక్ట్ ని ఆపేస్తాడా.. లేదా నెక్ట్స్ ఇయర్ దీన్ని పట్టాలెక్కిస్తాడా అనేది ఆసక్తికరం. మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో సంబరాలు చేసుకుంటున్నారు. ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి, శంకర్ సినిమా చేయడం ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, దిల్ రాజు శంకర్ బడ్జెట్ కి బ్రేక్స్ వేయకుండా ఉంటే ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్పపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసినిమా తర్వాత కొరటాల శివ సిినిమాతో పాటుగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus