Allu Arjun: ట్విట్టర్ లో తొలి రికార్డు సృష్టించిన తెలుగు హీరోగా బన్నీ రికార్డు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమా విడుదల ముందు వరకు ఈయన కేవలం దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఎంతోమంది ఫిదా అయిపోయారు. ఇకపోతే ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఇకపోతే అల్లు అర్జున్ తాజాగా ఒక యాడ్ కోసం పూర్తిగా తన లుక్ మార్చుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ యాడ్ కోసం ఈయన చెవికి పోగులు పెట్టుకోవడం అలాగే డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉండి నోట్లో సిగార్ పెట్టుకొని ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ విధంగా ఈ ఫోటోని అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇలా అల్లు అర్జున్ ఈ ఫోటో షేర్ చేయడంతో ఏకంగా ఈ ట్విట్ 200 వేలకు పైగా లైక్స్ సంపాదించుకుంది.

ఇలా ఒక ట్వీట్ కు ఇంత సంఖ్యలో లైక్స్ రావడం విశేషం. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్వీట్ కు వేల సంఖ్యలో లైక్స్ సాధించిన తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు. అల్లు అర్జున్ ఈ కొత్త లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే అల్లు అర్జున్ ఫోటో చూసిన రష్మిక తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఒక్కసారిగా ఇక్కడ మీరేనని గుర్తించలేకపోయాను సార్ అంటూ ఆమె అల్లు అర్జున్ లుక్ పై స్పందించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈయన సినిమాల విషయానికొస్తే పుష్ప సినిమాతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమాతో బిజీ కానున్నారు.ఇక ఈ సినిమా ఆగస్టు రెండవ వారం నుంచి షూటింగ్ జరుపుకోనుందని వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవి సెలవులలో విడుదల కానుందని తెలుస్తుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus